సినిమాలకు తగ్గట్టు వేషధారణ, శరీరాన్ని మార్చుకోవడం బాలీవుడ్‌లో సాధారణమే. టాలీవుడ్‌ వచ్చేసరికి సినిమాలో కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ… హీరో మాత్రం అలాగే ఉంటారు. చిన్న, చిన్న మార్పులు అంతే. ఇక శరీరాకృతిని మార్చుకోవడం, బరువు పెరగడం, తగ్గడంలాంటివి చాలా చాలా అరుదు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా సిక్స్‌ప్యాక్‌ ట్రై చేశారు. బహుబలి కోసం ప్రభాస్‌ విపరీతంగా బరువు పెరిగారు. ఇప్పుడు సాహో కోసం తగ్గారు. ఇలాంటివి మన టాలీవుడ్‌లో అరుదే. అయితే.. మరో కథానాయకుడు సుధీర్‌బాబు మాత్రం సినిమాకు తగ్గట్లు బరువు పెరుగుతూ, తగ్గుతున్నారు.

ప్రస్తుతం సుధీర్‌బాబు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటిస్తున్నారు. గోపీచంద్‌లాగా బక్కపల్చగా కనబడటానికి బరువు తగ్గారు. సుధీర్‌బాబు బరువు ఇప్పుడు 65 కేజీలు. బాలీవుడ్‌ మూవీ భాఘిలో విలన్‌గా నటించిన సుధీర్‌బాబు.. పాత్ర డిమాండ్‌ మేరకు 84 కేజీలు బరువు పెరిగారు. తెలుగులో సూపర్‌హిటైన వర్షం సినిమాను హిందీలో భాఘిగా రీమేక్‌ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వచ్చారు. సమ్మోహనం సినిమా సమయానికి 76 కేజీలకు చేరారు. బరువు దృష్టిపెట్టి మరింత తగ్గారు. ఇక పుల్లెల గోపిచంద్‌ సినిమా కోసం మరో 5 కేజీలు తగ్గి… ప్రస్తుతం 65 కేజీలకు వచ్చారు.

2012లో కథానాయకుడిగా తన తొలిసినిమా శివ మనసులో శృతి – SMS నుంచి ఇప్పటి వరకు ఏ సినిమాకు తాను ఎంత బరువున్నావో ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్‌బాబు పోస్ట్‌ చేశారు. ఇప్పుడు అది వైరల్‌ అవుతోంది.

కేజీలు సినిమా
72 శివ మనసులో శృతి
74 ప్రేమకథా చిత్రమ్‌
80 ఆడు మగాడ్రా బుజ్జీ
79 కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
84 భాఘి
80 భలే మంచిరోజు
78 శమంతకమణి
76 సమ్మోహనం
70 వి
65 పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌

వారం రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోనే తన బరువు 67.8 కేజీలని సుధీర్‌ పోస్ట్‌ చేశారు. రెండు నెలల్లోనే తాను 8 కేజీల బరువు తగ్గినట్లు చెప్పారు. వారంలోనే మరో 2 కేజీలు తగ్గి 65 కేజీలయ్యారు.

2019-05-29T10:51:16+00:00May 29th, 2019|Hot News, Tollywood|0 Comments