ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ట్వీట్టర్ వేదికగా పలు పోస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని సైకిల్‌ పంక్చరైందన్నారు. చంద్రబాబు పసుపు కుంకుమ పథకాల ద్వారా లబ్ధిపొందిన మహిళలు కారం పూసారన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి అనున్నట్లే రిటర్న్‌గిఫ్ట్‌ ఇచ్చారని వర్మ పోస్ట్ చేశారు. ఇక.. యాత్ర, ఎన్టీఆర్‌ సినిమాలను పోల్చుతు రిజల్ట్‌ కూడా అలాగే ఉన్నాయని చమత్కరించారు.

చంద్రబాబుతో పాటు లగడపాటి రాజగోపాల్‌, లోకేష్‌పైనా వర్మ వరస ట్వీట్ల దాడి చేశారు.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని వర్మ విడిచిపెట్టలేదు. జనసేనతో పోల్చితే… ప్రజారాజ్యమే బాహుబలని తేల్చారు.
చిరంజీవికి అభినందనలు అంటూ సెటైర్‌ వేశారు.


చివరగా.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన YSRCP అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి వర్మ శుభాకాంక్షలు తెలిపాడు.