నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తోంది. సింహా లెజెండ్‌ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో అఖండపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అఘోరాగా, రైతుగా తన నట విశ్వరూపం చూపనున్నారు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన పోస్టర్లు, టీజర్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తండ్రీకొడుకుల సందడి.. కలిసి స్టెప్పులేస్తున్న చిరు – చెర్రీ


అఖండ తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు. ఎన్బీకే 107 వర్కింగ్‌ టైటిల్‌లో మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమాకు సంబంధించి దసరాకు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య కొత్త సినిమా టైటిల్‌ ఇదేనంటూ కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్చల్‌ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్‌ ఫిక్స్ చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

PURNAA : కేక పుట్టిస్తున్న పూర్ణ లేటెస్ట్‌ హాట్‌ పిక్స్‌..

బాలకృష్ణ – బోయపాటి కాంబో మూవీ టైటిల్‌పై జరుగుతున్న చర్చకు మైత్రీ మూవీ మేకర్స్‌ ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. ఆ సినిమాకు రౌడీయిజం టైటిల్‌ ఫిక్స్ చేసారన్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్బీకే 107 టైటిల్‌ను సరైన సమయం వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఊహాగానాలను అభిమానులు దయచేసి నమ్మొద్దని అన్నారు.

అక్టోబర్‌ నుంచి ఎన్టీఆర్‌ 30.. ఫ్యూచర్‌ ప్రాజెక్టులతో తారక్‌ బిజీ..


ఇదిలా ఉంటే ఎన్బీకే 107 నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఫ్యాక్షనిస్టు లీడర్‌గా పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆయన కనిపించనున్నాడు. క్రాక్‌ సినిమాతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న గోపీచంద్‌ మలినేని బాలయ్యను సరికొత్తగా చూపనున్నట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్‌ ప్రారంభానికి సంబంధించి మేకర్స్‌ దసరాకు అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.