నందమూరి బాలయ్యతో తెర పంచుకోవడాన్ని కొందరు నటులు అదృష్టంగా భావిస్తుంటారు. బాలకృష్ణతో సెట్స్‌లో కలిసి పనిచేయడం అద్భుత అవకాశమని అంటుంటారు. ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంది హీరోయిన్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. బాలయ్యపై ఉన్న అభిమానంతోనే త్రిష ఎన్బీకే 137లో నటించేందుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా హీరోయిన్ పూర్ణ కూడా బాలయ్యతో నటించడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మొన్న తారక్.. నేడు రామ్‌చరణ్.. చెర్రీ కారు మామూలుగా లేదుగా
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న అఖండలో బాలకృష్ణతో కలిసి నటిస్తోంది పూర్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుండగా పూర్ణ కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నందున ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా పూర్ణ మీడియాతో ముచ్చటించింది. బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అనేక విషయాలు షేర్ చేసుకుంది.
చస్తే చద్దాం.. కానీ తేల్చుకునే చద్దాం.. ఇంట్రెస్టింగ్గా లవ్‌స్టోరీ ట్రైలర్
అఖండలో తన క్యారెక్టర్ చాలా స్టాంగ్ అని చెప్పిన పూర్ణ.. సెట్లో తొలిసారి బాలయ్య తనను రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యానని చెప్పింది. బాలయ్యను సింహంగా అభివర్ణించిన ఆమె.. షూటింగ్ సమయంలో ఆయన తోటివారిని ఎంతో గౌరవిస్తూ సాదా సీదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ మాట్లాడే విధానం, ఇచ్చే గౌరవం చూసి ఆశ్చర్యపోయానని అలాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని చెప్పింది. తన ఫోన్ వాల్ పేపర్‌గా బాలకృష్ణ ఫొటో పెట్టుకున్నానని, రోజూ లేవగానే ఆ ఫొటో చూసి ఎలాంటి కంప్లైంట్లు లేకుండా సింహంలా పనిచేయాలని స్ఫూర్తి పొందుతుంటానని పూర్ణ మీడియాకు వివరించింది. అలాగే అనే మాట తప్ప బాలకృష్ణ నోటి నుంచి మరో మాట రాదని, బాలయ్యలాంటి గ్రేట్ యాక్టర్‌తో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని ఆకాంక్షించింది.