ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోంది. చివరి షెడ్యూల్లో భాగంగా మారేడుమిల్లిలో కీలక సన్నివేశాలతో పాటు అల్లు అర్జున్, రష్మికపై శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాట చిత్రీకరించారు. అయితే భారీ వర్షాల కారణంగా మారేడుమిల్లిలో షూటింగ్ నిలిచిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చిత్ర యూనిట్ కాకినాడకు షిఫ్ట్ అయింది. పుష్ప ఫస్ట్ షెడ్యూల్ సైతం మారేడుమిల్లిలోననే జరగగా.. టీం సభ్యులకు కరోనా రావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. తాజాగా మరోసారి మారేడుమిల్లికి వెళ్లినా వర్షాలు సినిమా షూటింగ్‌కు అడ్డంకిగా మారాయి.
థర్డ్ షెడ్యూల్‌కు రెడీ అయిన బంగార్రాజు..
మారేడుమిల్లి నుంచి వచ్చిన చిత్ర యూనిట్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. మూడు రోజుల పాటు పోర్ట్ ఏరియాలో ఫైట్ సీన్స్ షూట్ చేసేలా ప్లాన్ చేశారు. కాకినాడలో చిత్రీకరణ పూర్తైన అనంతరం పుష్ప టీం మళ్లీ మారేడుమిల్లికి వెళ్లనుంది. మరో పది రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌తో ఒక పాట మినహా ఫుష్ప పార్ట్ 1 పూర్తికానుంది. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఓ స్పెషల్ సాంగ్ షూట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెలాఖరుకు పుష్ప పార్ట్ 1 సినిమా చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప షూటింగ్ నుంచి కాస్త విరామం దొరకడంతో బన్నీ కాకినాడలోని ఓ థియేటర్లో సీటీమార్ చిత్రాన్ని చూశారు. అల్లు అర్జున్ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
బాలయ్య “రౌడీయిజం”.. ఎన్బీకే 137 టైటిల్ అదేనా..!
బన్నీ లారీడ్రైవర్, స్మగ్లర్ పాత్ర పోషిస్తున్న పుష్ప : ద రైజ్ మూవీని ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను దసరా బరిలో నిలపాలని భావించినా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో పుష్ప పార్ట్ 1ను రిలీజ్ చేయాలని మూవీమేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.