మొత్తానికి సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, విజయ్‌దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహర్షి సినమా షూటింగ్‌ దగ్గర నుంచి వీరిద్దరి మధ్య స్నేహం మరింత పటిష్టమైంది. ఇదేక్రమంలో.. ఈ ఇద్దరు నటులు.. టైమ్స్‌ ఏటా ప్రకటించే డిసెరబుల్‌ మేన్‌కి సంబంధించి వేర్వేరు విభాగాల్లో చోటు దక్కించుకొని అభిమానుల్లో హుషారు నింపారు.

టైమ్స్‌ మేగజీన్‌ ఏటా ప్రకటించే`మోస్ట్‌ డిజైరబుల్‌ మేన్‌`గా మహేష్‌ చాలాసార్లు నిలిచాడు. 2018కి సంబంధించి టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌లో చేరాడు. ఈ జాబితాలో టైమ్స్‌ మార్పులు చేసింది. గతంలో వయసుతో సంబంధం లేకుండా ఎంపిక చేసేవారు. ఇప్పుడు యువ నటులకే అవకాశం ఇస్తున్నారు. ఇలా కొత్తగా మార్పులు చేసిన తర్వాత వెలువడిన తొలి మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌కి ఎంపికైన ఏకైక దక్షిణాది నటుడు మహేష్‌ మాత్రమే.

ఇక.. ది టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ మేన్‌ కేటగిరీలో రౌడీ హీరో విజయ్‌దేవరకొండ టాప్‌టెన్‌లో నిలిచాడు. నాలుగో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి టాప్‌టెన్‌లో ఇ‌ద్దరికే చోటు దక్కింది. విజయ్‌ దేవరకొండ నాలుగో స్థానంలో నిలవగా, టైమ్స్‌ జాబితాలో అతడికి చోటు దక్కడం ఇదే తొలిసారి. మహానటిలో నటించిన మళయాళ నటుడు దుల్హార్‌ సల్మాన్‌ తొమ్మిదో ర్యాంకు పొందాడు. గతేడాది రెండోస్థానంలో నిలిచిన బాహుబలి ప్రభాస్‌ 2018 జాబితాలో12వ స్థానంలో, భల్లాలదేవ రానా ఏడో స్థానం నుంచి 19వ ర్యాంకుకు పడిపోయాడుగతేడాది బహుబలి ఫీవర్‌ ఉండటంతో.. ప్రభాస్‌, రానా టాప్‌లో ఉన్నారు. బహుబలి తర్వాత ప్రభాస్‌ మరో సినిమా విడుదల కాలేదు. సాహో విడుదలైతే.. ప్రభాస్‌కి మంచి ర్యాంకు దక్కే అవకాశం ఉండేది.

`ఉరి ది సర్జికల్‌ స్ట్రైక్‌` చిత్రంతో బాలీవుడ్‌లో ప్రతిభ చాటుకున్న విక్కీ కౌశల్‌ది టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ మేన్‌ కేటగిరీలో అగ్రస్థానం సంపాదించాడు. ఫుట్‌బాల్ ఆటగాడు ప్రతమేష్‌ మౌలింగ్‌కర్‌ రెండో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ మూడు, భారతజట్టు క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఐదో స్థానం దక్కించుకున్నారు. బాలీవుడ్ నటులు విద్యుత్‌ జమ్మాల్‌ ఆరు, హృతిక్‌రోషన్‌ ఏడు, కార్తీక్‌ ఆర్యన్‌ ఎనిమిది, సిద్ధార్థ్‌ మల్హోత్రా పదో స్థానంలో నిలిచారు.

మోస్ట్‌ డిజైరబుల్‌ మేన్‌ అనగానే వినిపించే ఖాన్‌ త్రయం పేర్లు ఈ సారి జాబితాలో లేదు. అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌తో పాటు.. అక్షయ్‌కుమార్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌లో చేరిపోవడమే ఇందుకు కారణం.

 

Super Star Mahesh Babu, Vijay Devarakonda Listed Times Most Desirable Men 2018, Prabhas, Rana in Under 20.