సండేని ఫండేగా మారుస్తానని చెప్పిన కింగ్‌ నాగార్జున అన్నట్టుగానే బిగ్‌బాస్‌ షోని ఆదివారం అలరించాడు.
ఫ్రెండ్‌షిప్‌ డే టాస్క్‌ పెట్టి… తనకిష్టమైన వారికి బాండ్‌ కట్టమని చెప్పాడు. ఎందుకో వివరించమన్నాడు. తొలి అవకాశం శ్రీముఖికి ఇవ్వగా…తను బాబా మాస్టర్‌కి ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ కట్టింది. హిమజ మహేష్‌కి కట్టింది. ఇక్కడకు వచ్చిన తర్వాత తనకు మంచి ఫ్రెండ్‌ అయ్యాడని తెలిపింది. ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ని జాఫర్‌, బాబా మాస్టర్‌కి కడతారని అందరూ అనుకున్నారు. జాఫర్‌ మాత్రం రోహిణికి కట్టేశారు. బాబా మాస్టర్‌లాగే రోహిణికీ ఎలాంటి కల్మశాలు లేవన్నారు. రాగద్వేశాలకు అతీతంగా ఉంటుందన్నారు. అందరితో హాయిగా మాట్లాడుతుందని చెప్పాడు. అందుకే రోహిణీ నచ్చిందని చెప్పిన జాఫర్‌ ఆమెకే ఫ్రెండ్‌షిఫ్‌ బాండ్‌ కట్టాడు. అష్షు, శివజ్యోతిని ఆటపట్టించిన బాబా భాస్కర్‌… ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ని జాఫర్‌కి కట్టాడు. ఇంట్లోకి వచ్చేసరికి నాకు తెలిసిన వ్యక్తి జాఫరే అన్నారు. తనతో వేవ్‌లెంగ్త్‌ కలిసిందని బాబా భాస్కర్‌ తెలిపారు.

మహేష్‌, అష్షుకి కట్టాడు. 100 రోజులు కుటుంబానికి దూరంగా ఎలా ఉండాలనుకుంటున్న టైంలో బిగ్‌బాస్‌ హౌజ్‌లో తొలిసారి అష్షు కనబడటం రీలిఫ్‌ ఇచ్చిందన్నాడు. కొత్త ప్రదేశంలో పాజిటివ్‌ ఎనర్జీ వచ్చిందని తెలిపాడు. శివజ్యోతి హిమజకు కట్టింది. తాను, రోహిణి, అష్షు మొదటి నుంచి మంచి స్నేహితులమని చెప్పిన శివజ్యోతి.. హిమజ కూడా ఇటీవల స్నేహితురాలైందని చెప్పింది. శ్రీముఖిని కోతిగా సరదాగా తిట్టుతూ.. తమన్నా ఫ్రెండ్‌షిఫ్‌ బ్యాండ్‌ కట్టింది. బిగ్‌బాస్‌ ఎంట్రీ నుంచి తనతో కలిసి ఉంటుందని చెప్పింది. వాష్‌రూమ్‌కి కూడా తాను, శ్రీముఖి కలిసే వెళతామని చెప్పడంతో.. అంతా నవ్వారు. రోహిణి, తమన్నాకు ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ కట్టింది. అష్షు శివజ్యోతికి కట్టింది. తనకు మొదట పరిచయమైన శివజ్యోతి.. ఇంటికి వెళ్ళాలనిపిస్తే ధైర్యం చెప్పిందని అష్షు వివరించింది.

అలీ – రవికృష్ణ, పునర్నవి – వితిక, వరుణ్‌ – రాహుల్‌

హౌజ్‌లో మిగిలిన సభ్యులకు ఒకరికి మరోకరు సంబంధంలేకుండా ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌లు కట్టుకోగా, వీళ్ళంతా
ఒకరికొకరు కట్టుకున్నారు. రవికృష్ణ 8 ఏళ్ళ నుంచి స్నేహితుడన్న అలీ… కెప్టెన్సీకి ఓటు వేయకున్నప్పటికీ.. వాడే తన ఫ్రెండ్‌ అన్నాడు. బిగ్‌బాస్‌కి రాకముందు, వచ్చిన తర్వాత తనకు అలీ ఫ్రెండ్‌షిఫ్‌ కావాలని రవికృష్ణ బాండ్‌ కట్టాడు. బిగ్‌బాస్‌లో అందరికంటే తాము ఒకరికొకరం క్లోజ్‌ అయ్యామని వరుణ్‌, రాహుల్‌ తెలిపారు. తమ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయన్నారు. బయటకు వెళ్లిన తర్వాత కూడా తమ స్నేహం కొనసాగుతుందని చెప్పారు. వరుణ్‌, రాహుల్‌లాగే వితికి శేరు, పునర్నవి ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ కట్టుకున్నారు. రెండు వారాల్లో ఎన్నో విషయాలు పంచుకున్నామని వారిద్దరూ తెలిపారు. ఒకరికొకరం ఎలాంటి బేషజాలు లేకుండా అన్ని విషయాలు మాట్లాడుకున్నామని వివరించారు.

ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ కట్టిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో స్నేహం గొప్పదనాన్ని వివరిస్తూ.. పాటలు వేయడం అలరించింది. అందుకు తగ్గట్లుగా హౌజ్‌మేట్స్‌ నృత్యం చేశారు. జాఫర్‌ సైతం బేషజాలు విడిచి రోహిణికి కట్టినప్పుడు, తనకు బాబా మాస్టర్‌ కట్టినప్పుడు.. రెండుసార్లు డాన్సు వేశారు. అలా ఫ్రెండ్‌షిప్‌ డే టాస్క్‌ సరదాగా అందరికీ ఆనందం పంచింది.