సాయి పల్లవి….. సౌత్ ఇండియాలో ఇప్పుడు అత్యంత క్రేజ్ ఉన్న హీరోయిన్‌ ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు. తనకంటూ సొంత స్టైల్‌తో హీరోయిన్‌గా దూసుకుపోతోంది. స్టార్ హీరో, స్టార్ దర్శకుడు అని కాకుండా కథ నచ్చితేనే ఓకే చెబుతోంది. ఈ పిల్ల ఏందిరా బాబు ఇంత మంచి అవకాశాన్ని కోల్పోయింది… అని ఇండస్ట్రీలో ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మంచి పాత్రలను ఒడిసి పట్టుకుంటోంది. తన సహజమైన నటన, ఉర్రూతలూగించే డాన్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఇక సాయి పల్లవి సోషల్ మీడియాలో తన రికార్డులను తానే బీట్ చేసుకుంటూ ప్రతిభ చాటుతోంది.

సాయిపల్లవి సినిమాలు, పాటలు, ఆమె పోస్టులు వరుసగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటించిన పాటలైనా, తన పోస్ట్ చేసిన ఫోటోలైనా యూత్ తెగ ఫాలో అవుతున్నారు. 2005లో మలయాళం మూవీ ప్రేమమ్‌తో చిత్రసీమకు పరిచయమైన సాయి పల్లవి… ఆ సినిమాలో యంగ్ లెక్చరర్ మలర్‌గా యువ హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమాలో `అలరే` సాంగ్ హిట్ అయింది. మేకప్ లేకుండా సహజ సుందర స్వరూపంతో వారెవ్వా అనిపించింది.

ఇక 2017లో ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి… అందులో పోషించిన పాత్రకు తను తప్పు మరోసారిని ఊహించలేనంతగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో వచ్చిండే సాంగ్ యూట్యూబ్‌లో వైరలైంది. అత్యంత ఎక్కువ మంది చూసిన సౌత్ ఇండియా సాంగ్ కొలవెరి రికార్డులను కొల్లగొట్టింది.

ఆ తర్వాత తమిళ్ మూవీ మారీ-2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ 16 రోజుల్లోనే పదికోట్ల మంది చూశారు. వచ్చిండే సాంగ్ రికార్డులను రౌడీ బేబీ సాంగ్ బీట్ చేసింది. రౌడీ బేబీ సాంగ్ ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో సెట్ లో ప్రభుదేవాతో కలిసి దిగిన ఫోటో కూడా సాయి పల్లవి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. పదేళ్ల క్రితం ఇదే సెట్లో ప్రోగ్రాం లో తను కంటెస్టెంట్ గా పాల్గొన్నానని, ప్రస్తుతం ఆయన నృత్య దర్శకత్వంలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఫోటో కూడా సోషల్‌ మీడియాలో వైరలైంది.

తన పుట్టిన రోజు సందర్భంగా కేరళ సంప్రదాయ దుస్తుల్లో సాయి పల్లవి ముస్తాబై ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసిన ఫోటో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అభినయ తార ఫోటోను యూత్ పెద్ద సంఖ్యలో షేర్ చేశారు. ఇలా వరుసగా తన ఫోటోలు వీడియోలతో సాయి పల్లవి క్రేజ్ సంపాదించుకుంటోంది.