నాకు ఎవరూ లేరు. నాకు నేనే. నాతో నేనే.” బంధాలు, అనుబంధాలు, స్నేహం, ప్రేమపై ప్రమఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను ప్రశ్నలు అడిగితే వచ్చే సమాధానాలు. ఇంటర్వ్యూలలో ఆయన ఇలా చెప్పినా.. ఇన్నర్‌గా మాత్రం వర్మది చాలామంచి మనసంటారుఆయన మనసు తెలిసిన వారు. ఆ విషయాన్ని అప్పుడప్పుడు వర్మ కూడా తెలియకుండానే బయటపెట్టుకుంటారు. ఎంతోమంది దర్శకులకు గురువైన వర్మకు.. పూరి జగన్నాథ్‌ ప్రియశిష్యుడు. ఆ అభిమానాన్ని ట్వీట్టర్‌ వేదికగా ఇలా పంచుకున్నాడు.

వర్మ, పూరిల అనుబంధాన్ని చెప్పే చిత్రమిది. వర్మ హైదరాబాద్‌ వస్తే మొదట కలిసి, వెళ్ళేటప్పుడు బై చెప్పే వ్యక్తి పూరినే. ఆ విషయం పూరిజగన్నాథే చెప్పారు. “ మేం పాతికేళ్ళుగా ప్రేమించుకుంటూనే ఉన్నం. వర్మ నాకు ఇప్పటివరకూ బోర్‌ కొట్టలేదు. ఈ మధ్య వర్మ హైదరాబాద్‌ వస్తే నాతోనే ఎక్కువగా ఉంటున్నారు. దానిపై వర్మ తల్లి ఫీల్‌ అవుతుందంటూ.. గురువుతో తన అనుబంధాన్ని పూరి జగన్నాథ్‌ పంచుకున్నాడు.

వర్మ ` నా ఇష్టం` పుస్తకంలో సైతం గురువుపై పూరి అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు ఆ గురువే.. ఇరువురి ముఖాలతో ఉన్న ఫోటోను షేర్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు.

Ram Gopal Varma Express His Affection On Puri jagan.

Sharing A Photo on His Twitter @RGVzoomin .

And Titled With “ Is That Puri Varma Or Ram Jagan.?