నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న మన్మథుడు2 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నెల రోజుల పాటు ఏకదాటిగా సాగిన పోర్చుగల్‌ షెడ్యూల్‌ ముగిసింది. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా పోర్చుగల్‌కి సంబంధించిన ఫోటోలను చిత్రబృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది.

 నాగార్జున తన కోడలు సమంతాతో కలిసి నటిస్తున్న రెండో సినిమా మన్మథుడు2. గతంలో వీరిద్దరూ రాజుగారిగది2లో నటించారు. ఈ సందర్భంగా ట్వీట్టర్‌లో సమంతాతో దిగిన చిత్రాన్ని షేర్‌చేసిన నాగార్జున.. కోడలి పిల్లతో షూటింగ్‌ సరదాగా గడించిందన్నారు.

ఇందుకు కోడలు సమంత ప్రతిస్పందించింది. మన్మథుడు2లో తనది చిన్న పాత్రని తెలిపింది. కావాల్సినంత సానుకూల వాతావరణంలో షూటిగ్‌ జరిగిందని తెలిపింది. దర్శకుడు రాహుల్‌, కథానాయిక రకుల్‌, నటుడు వెన్నెల కిషోర్‌కి శుభాకాంక్షలు చెప్పింది.

మన్మథుడు2 పోర్చుగల్‌ షెడ్యూల్‌ మొత్తం సరదా సరదాగా సాగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. వెన్నెల కిషోర్‌, నాగార్జున ఫోటోలు చూస్తుంటే.. షూటింగ్‌ అంతా నవ్వులమయమని అర్థమవుతోంది.

ఇటీవల 60 ఏళ్ళ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జున ఇప్పటికీ నవ మన్మథుడిగా ఎందుకు కనిపిస్తాడో.. ఆయన జిమ్‌లో చేస్తున్న కసరత్తులు చూస్తుంటే తెలుస్తుంది. ఈ దృశ్యాలను దర్శకుడు రాహుల్‌ తన కెమోరాలో తీశాడు. సర్‌.. రకుల్‌ ఎక్కడ షూటింగ్ టైం అవుతుందంటే.. హీరోయిన్‌ని చూపించిన నాగార్జున తనను ఇబ్బందిపెట్టవద్దంటూ తనతో షూటింగ్‌ జరపమని రాహుల్‌ని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు.

వెన్నెల కిషోర్‌ కూడా తనదైన శైలిలో చేసిన వ్యాయమం చేసి అందర్నీ నవ్వించింది.

రాహుల్‌ దర్శకత్వంలో వస్తున్న రెండోసినిమా మన్మథుడు. గతేడాది ఆయన తొలిసారి మోగాఫోన్‌ పట్టి చి.ల . సౌ. తీశారు. రెండో ప్రయత్నంలోనే నాగార్జునతో పనిచేసే అవకాశం వచ్చింది. 2002లో వచ్చిన మన్మథుడులో నాగార్జునకు అమ్మాయిలంటే చిరాకు. అందుకు తగ్గట్లే అమ్మాయిల ఏడుపన్న, అంబులెన్స్‌ సైరన్‌ అన్న తనకు అసహ్యమనే డైలాగులు ఉన్నాయి. 17 ఏళ్ల తర్వాత తీస్తున్న మన్మథుడు సీక్వెల్‌లో మాత్రం నాగార్జున పూర్తి విరుద్ధమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఆలోచనలన్నీ అమ్మాయిల చుట్టే తిరుగుతుంటాయి. మన్మథుడు2లో రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. సమంతా, కీర్తిసురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్‌ నటి లక్ష్మీతో పాటు వెన్నెల కిషోర్‌వి ఇతర ప్రధాన పాత్రలు.