2002లో మన్మథుడు రిలీజైంది. ఆ సినిమాలో నాగార్జునకు అమ్మాయిలంటే అస్సలు పడదు. 17 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు మరోసారి మన్మథుడిగా వస్తున్న నాగార్జునకు అమ్మాయిలు తప్ప మరో ఆలోచన ఉండదు. ఇదే మన్మథుడు2 టీజర్ చెప్పే కథ. అంతకుమించి విషయాలు టీజర్లో లేవు. పెళ్ళి చేసుకోవాలనుకున్న హీరో తపనపై.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. లేటు వయసులో నాగార్జునను మరోసారి మన్మథుడిగా చూపించాలనే ప్రయత్నం కనిపించింది.
ఓవరాల్‌గా మన్మథుడు 2 టీజర్ అలరించలేకపోయింది. ఆకట్టు ఏ అంశాన్నీ చూపించలేదు. ముఖ్యపాత్రలో నటిస్తున్న సమంత, కీర్తిసురేష్ సహా.. కథానాయిక రకుల్ టీజర్లో కనిపించలేదు. కానీ.. ఆరు పదులు దాటిన వయసులోనూ నాగార్జున మాత్రం… నవ మన్మథుడిగానే కనిపిస్తున్నాడు. యువ హీరోలతో పోటీపడే లుక్కు, నటనతో ఆకట్టుకున్నాడు. టీజర్ చివర్లో అమ్మాయిలతో సరదాగా ఉండే నాగార్జున.. శృంగార దృశ్యాల్లో నటించడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.
కథానాయకుడి నుంచి దర్శకుడిగా మారిన రాహుల్ గతేడాది మోగాఫోన్ పట్టాకున్నాడు. చి.ల . సౌ.తో ఆకట్టుకున్నాడు. రెండో ప్రయత్నంలో ఉండగా నాగార్జున మంచి ఆఫర్ ఇచ్చాడు. 2002లో వచ్చిన మన్మథుడులో నాగార్జునకు అమ్మాయిలంటే చిరాకు. అందుకు తగ్గట్లే అమ్మాయిల ఏడుపన్న, అంబులెన్స్ సైరన్ అన్న తనకు అసహ్యమనే డైలాగులు ఉన్నాయి. 17 ఏళ్ల తర్వాత తీస్తున్న మన్మథుడు సీక్వెల్లో మాత్రం నాగార్జున పూర్తి విరుద్ధమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఆలోచనలన్నీ అమ్మాయిల చుట్టే తిరుగుతుంటాయి. మన్మథుడు2లో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సమంతా, కీర్తిసురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీతో పాటు వెన్నెల కిషోర్వి ఇతర ప్రధాన పాత్రలు.
నాగార్జున తన కోడలు సమంతాతో కలిసి రాజుగారి గది2లో నటించారు. ఇప్పుడు.. వారిద్దరూ నటిస్తున్న రెండో సినిమా మన్మథుడు2. ఇటీవల పోర్చుగల్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మన్మథుడు2 షూటింగ్ అంతా సరదసరదగా గడిచింది. ఆ షూటింగ్‌కి విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.