మహర్షి సక్సెస్‌తో ఫుల్‌జోష్‌లో ఉన్న సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ఈ సారి మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌తో అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఫ్యామిలీ హాలీడే ట్రిప్‌లో ఉన్న మహేష్.. టూర్ ముగించుకుని వచ్చాక ఈ వినోదాత్మక చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మహేష్‌తో తీయనున్న సినిమా కోసం అనిల్ రావిపూడి క్రేజీ టైటిల్ వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్యకు ఈ స్టోరీ వినిపించిన డైరెక్టర్ అప్పట్లో సినిమాకు రామారావుగారు అని టైటిల్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ కథానాయకుడిగా అనుకుంటున్న ఈ చిత్రంలో ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ జతచేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. అందుకు తగ్గట్లుగానే టైటిల్ కొంచెం డిఫరెంట్ ఉంటాలని అనుకుంటన్నారట. రెడ్డిగారి అబ్బాయి టైటిల్ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

మహేష్ హీరోగా తెరకెక్కిన ఆగడు తరహాలోనే మాస్ ఫార్ములాతో రెడ్డి గారి అబ్బాయి తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ గ్రౌండ‌్‌లో స్టోరీ నడుస్తుందని సమాచారం. సినిమాలో కామెడీ డోస్‌కు కూడా బాగానే ఉంటుందని.. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలని డైరెక్టర్ భావిస్తున్నారట.

అనిల్ రావిపూడితదుపరి చిత్రానికి రెడ్డిగారి అబ్బాయి టైటిల్ అనుకుంటున్నట్లు వస్తున్న ఊహాగానాలపై సినిమా టీం క్లారిటీ ఇచ్చింది. అయితే అది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, రియల్ టైటిల్ తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు.

శ్రీమంతుడు, స్పైడర్‌, మహర్షి.. ఇలా వరసగా సందేశాత్మక చిత్రాలు ఇచ్చిన మహేష్‌.. అతడు, దూకుడు తరహాలో మంచి కామోడీ సినిమా చేయాలని నిర్ణయించాడు. అందుకే అనిల్‌ రావిపూడి చెప్పిన కథకు వెంటనే ఓకే చేశాడు. అల్లు అరవింద్‌, దిల్‌రాజుకు ప్రస్తుతం సినిమా చేస్తానని మహేష్‌ మాట ఇచ్చాడు. అనిల్‌ రావిపూడి ఇప్పటికి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. మూడు దిల్‌రాజు బ్యానర్‌లోనే తీశాడు. ఈ లెక్కన రెడ్డి గారి అబ్బాయిని దిల్‌ రాజు నిర్మించే అవకాశం ఉంది.

Mahesh Next Film Title `Reddy Gari Abbayi ..!` Anil Ravipudi Will Direct The Film Under Dil Raju Production