సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన మహర్షి మాయ చేస్తోంది. కలెక్షన్లలో దూసుకెళ్తోంది. యువతరం ఆలోచనలను మార్చేస్తోంది. ఇన్నిరోజులు పల్లెలకు వెళ్ళాలని ఉన్నప్పటికీ వాయిదా వేసుకుంటున్న యువత.. మహర్షి స్ఫూర్తితో గ్రామాల్లో అడుగుపెడుతోంది. ఈ శని, ఆదివారం యువజనులు వీకెండ్‌ వ్యవసాయం చేశారు. ఇన్నాళ్ళు తాము ఏం కోల్పోయామో సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్నారు.

ఇందులో యువత వ్యవసాయం చేస్తున్న ఓ వీడియో వైరలైంది. అయితే.. ఓ సినిమా ఇచ్చిన స్ఫూర్తి ఎన్నాళ్ళు నిలుస్తుందో చూడాలి. నిజంగా మహర్షి స్ఫూర్తితో యువతరం ఆలోచనలు కాస్తా మారి, వీకెండ్‌ అయినా గ్రామాలకు వెళితే.. సాంకేతికపై రైతన్నలకు అవగాహన కలుగుతుంది. వ్యవసాయం పండగ అవుతుంది.

నిర్మాత మధుర శ్రీధర్‌ వ్యవసాయం చేస్తున్న ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దానిని మహేష్‌బాబు రీట్వీట్‌ చేశారు.