తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన టెంపర్‌ని అయోగ్య పేరుతో విశాల్‌ రీమేక్‌ చేశాడు. వివాదాల మధ్య ఒకరోజు ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా మంచిటాక్‌తో సాగుతోంది. మరోవైపు పెళ్ళిపనులు, నడిగర సంఘం భవన నిర్మాణం మధ్య తలమునకలైన విశాల్‌.. తదుపరి చిత్రంపై దృష్టి సారించాడు. పందెంకోడి -2 విజయం ఇచ్చిన స్ఫూర్తితో గతేడాది వచ్చిన అభిమాన్యుడికి సీక్వెల్‌ తీయాలని నిర్ణయించుకున్నాడు. సమంతగా ఈ సినిమాలో కథానాయికగా నటించగా.. సీక్వెల్‌లో మాత్రం అవకాశం జెర్సీ నాయిక శ్రద్ధశ్రీనాథ్‌కి తగ్గింది.

అభిమన్యుడకి సీక్వెల్‌ తీయాలనే ఆలోచనకు పందెంకోడి -2 హిట్‌ కావడమే కారణం. 14 ఏళ్ళ క్రితం పందెంకోడి సినిమాకు దర్శకత్వం వహించిన లింగుస్వామికే సీక్వెల్‌ అవకాశం దక్కింది. అభిమాన్యుడు విషయంలో మాత్రం అలా జరగలేదు. అభిమన్యుడు సినిమాకు మిత్రన్‌ దర్శకత్వం వహించగా… సీక్వెల్‌ని కొత్త దర్శకుడు ఆనంద్‌ తెరకెక్కించనున్నాడు. విశాల్‌, మిత్రన్‌ కాంబినేషన్‌లో తొలి సినిమాగా వచ్చిన డిటేక్టివ్‌
కూడా హిట్టయింది.

Shraddha Srinath Selected Heroine In Vishal`s Next