అందంతో పాటు అభినయంతో ఇటు సౌత్‌ అటు నార్త్‌ ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తోంది సమంత. శాకుంతలం మూవీ పూర్తవడంతో షూటింగ్‌ల నుంచి బ్రేక్‌ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారింది. టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరున్న సమంత – నాగచైతన్య విడిపోతున్నారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై సామ్‌గానీ చైతూగానీ క్లారిటీ ఇవ్వకపోవడం అనుమానాలను మరింత బలపరుస్తోంది. వీరిద్దరిదీ ఏడేళ్ల ప్రేమ.. నాలుగేళ్ల వైవాహిక బంధం కాగా.. ప్రస్తుతం ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

లవ్‌స్టోరీలో డైలాగ్‌పై దుమారం.. ఇంతకీ చైతూ ఏమన్నాడు..!


సమంత -నాగచైతన్యల మధ్య మనస్పర్థలకు కారణాలేంటన్నది స్పష్టంగా తెలియకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం పలు కథనాలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మేన్‌ 2 వెబ్‌సీరిస్‌తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన సమంతకు ఒక్కసారిగా నార్త్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి ఇకపై కంప్లీట్‌గా బాలీవుడ్‌పై ఫోకస్‌ చేయాలని నిర్ణయించుకుందట. ఇందుకోసం ముంబై షిఫ్ట్‌ అయిపోవాలని డిసైడ్‌ అయిన సమంత ఇదే విషయాన్ని భర్త నాగచైతన్యతో డిస్కస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ టాపిక్‌ కాస్తా వారి మధ్య చిచ్చుపెట్టిందన్న టాక్‌ వినిపిస్తోంది. ముంబైకి షిఫ్ట్‌ అయ్యేందుకు నాగ చైతన్య ససేమిరా అనడంతో సమంత తన దారి తాను చూసుకుంటానని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇరువురి తరఫు పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం.

థియేటర్లలో శ్యామ్‌ సింగరాయ్‌..? రిలీజ్‌ ఎప్పుడంటే..!


ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం సమంత తన సోషల్‌ మీడియా అకౌంట్లలో అక్కినేని పదాన్ని తొలగించింది. ఎస్‌ అక్షరాన్ని మాత్రమే పెట్టుకుంది. ఇలా పేరు మార్చుకోవడానికి కారణమేంటన్న దానిపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే సామ్ పేరు మార్చుకోవడానికి హీరో సిద్ధార్థ్‌ కారణమని పుకార్లు షికారు చేస్తున్నాయి. నిజానికి సమంత – నాగ చైతన్యతో ప్రేమలో పడకముందు హీరో సిద్ధార్థ్‌తో లవ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగింది. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విడిపోయారని కథనాలు వినిపించాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పిన మాటలు అది నిజమేనన్న భావన కలిగించాయి. గతంలో ప్రేమ విషయంలో మోసపోయానని అదృష్టం కొద్దీ బయటపడ్డానంటూ ఆమె చేసిన కామెంట్‌లు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం హీరో సిద్దార్థ్‌ ఆమె లైఫ్‌లోకి మళ్లీ వచ్చాడని.. ఆ కారణంగానే సమంత చైతూను దూరం పెడుతోందన్న టాక్‌ వినిపిస్తోంది.

పాటల కోసం గోవాకు బాలయ్య.. అఖండ విడుదలపై సస్పెన్స్‌..?


పాన్‌ ఇండియా మూవీ శాకుంతలం షూటింగ్ పూర్తవడంతో సమంత షూటింగ్‌ల నుంచి కొంత సమయం బ్రేక్‌ తీసుకోవాలని భావిస్తోంది. ఫ్రెండ్‌తో కలిసి హాలీడే ట్రిప్‌ కోసం గోవాకు వెళ్లింది. అయితే గోవా నుంచి సమంత ఒక్క రోజు కోసం హైదరాబాద్‌ వచ్చి వెళ్లింది. డైవోర్స్‌ ప్రాసెస్‌లో భాగంగా కౌన్సిలింగ్‌కు అటెండ్‌ అయ్యేందుకు ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. విడాకుల విషయంలో నాగ చైతన్య – సమంత స్పష్టత ఇవ్వకపోయినా తెరవెనుక ఆ ప్రాసెస్‌ కంటిన్యూ అవుతోందని సమాచారం. వారిద్దరూ మ్యూచువల్‌ డైవర్స్‌కి అప్లై చేశారని, ఫస్ట్‌ కౌన్సిలింగ్‌ కూడా పూర్తైందని టాక్‌ వినిపిస్తోంది. డైవోర్స్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత సమంత ముంబైకి షిఫ్ట్ కానున్నట్లు సమాచారం.