టాలీవుడ్‌ను లీకుల భూతం వెంటాడుతోంది. బడా సినిమాల ట్రైలర్లు మొదలుకొని కీలక సీన్లు, పాటలను లీక్‌ చేస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్‌ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ పుష్పను లీకుల భయం వెంటాడుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాలు రెండు పార్ట్‌లుగా విడుదల చేయనున్నారు. పార్ట్‌ వన్‌కు సంబంధించి ప్రస్తుతం కాకినాడ పోర్టు, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్‌ జరుగుతోంది.

MAHESH BABU : స్పెయిన్‌కు వెళ్తున్న మహేశ్‌బాబు..


పుష్ప షూటింగ్‌ ప్రస్తుతం ఔట్‌డోర్‌లో కొనసాగుతుండటంతో జనాలను అదుపు చేయడం చిత్రబృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొందరు యువకులు సినిమా సెట్‌తో పాటు కొన్ని సీన్లను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో చిత్ర యూనిట్‌ షూటింగ్‌ స్పాట్‌లో ఫొటోలు, వీడియోలు తీసినచో సెల్ ఫోన్‌ పగలగొట్టబడును అని బోర్డులు పెట్టారు. కొందరు వాటిని కూడా ఫొటో తీసి షేర్‌ చేస్తుండటంతో వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలా అని పుష్ప టీం తలపట్టుకుంటోంది.

కాజల్‌ గుడ్‌న్యూస్‌ చెబితే ఆ సినిమాల సంగతేంటి..?

వాస్తవానికి షూటింగ్ ప్రారంభం నుంచి పుష్ప చిత్రాన్ని లీకుల బెదడ వెంటాడుతోంది. ఆ మధ్య దాక్కో దాక్కో మేక పాటను అఫీషియల్‌ రిలీజ్‌కు ముందే లీకు చేసిన కేటుగాళ్లు.. ఆ తర్వాత ఓ పెళ్లి మండపంలో అల్లు అర్జున్‌ రౌడీలను చితక్కొట్టే యాక్షన్‌ బిట్‌ను నెట్‌లో వైరల్‌ చేశారు. అంతటితో ఆపకుండా మెలోడీ బీట్‌తో వల్లీ.. వల్లీ అంటూ హీరోయిన్‌ రష్మికపై సాగే ఈ పాటను షూటింగ్‌ సమయంలో రికార్డు చేసి నెట్టింట్లో పెట్టారు.

దసరాకు ఫిక్సైన నాని.. ప్రేమకథ చెబుతానంటున్న నేచురల్‌ స్టార్


పుష్పలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నాడు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కథాంశంతో సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో రష్మిక మందన్న బన్నీతో జతకట్టగా.. మలయాళ స్టార్‌ హీరో ఫహాద్‌ ఫాజిల్‌ విలన్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరెకెక్కుతున్న పుష్ప పార్ట్‌ 1 కోసం బన్నీ ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్‌, పోస్టర్స్‌ ఫస్ట్‌ సింగిల్‌ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. క్రిస్మస్ సందర్భంగా పుష్ప పార్ట్‌ 1ను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు.