ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తికావడంతో ఫ్యూచర్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. రామ్‌చరణ్‌ ఇప్పటికే శంకర్‌ సినిమాను పట్టాలెక్కించగా.. తాజాగా తారక్‌ సైతం కొత్త ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ తన నెక్ట్స్‌ మూవీ చేయనున్నారు. NTR30 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ పాన్‌ ఇండియా మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. మూవీకి సంబంధించి ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.

టాలీవుడ్‌కు గుడ్‌బై..? చైతూతో సమంత దూరానికి రీజన్ అదేనా..


NTR 30 సినిమాను అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో లాంఛ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ నుంచి మూవీ రెగ్యులర్‌ షూట్‌ జరపాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. జనతా గ్యారేజ్‌ తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. NTR 30లో తారక్‌ సరసన ఆలియా భట్‌ నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా హీరోయిన్‌గా కియారా అద్వానీ, సమంత పేర్లు వినిపించాయి. చివరకు ఆలియా భట్‌కు ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. కొరటాల శివ ఈ ప్రాజెక్టు కోసం కియారా అద్వానీని సజెస్ట్‌ చేసినా. పాన్‌ ఇండియా మూవీ కావడంతో మేకర్స్‌ పేరున్న బాలీవుడ్‌ నటిని తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కియారాను పక్కనపెట్టి ఆలియాభట్‌కు ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిక్కిలినేని సుధాకర్‌, కల్యాణ్‌ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 2022 ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు.

లవ్‌స్టోరీలో డైలాగ్‌పై దుమారం.. ఇంతకీ చైతూ ఏమన్నాడు..!


కొరటాల మూవీ పూర్తైన వెంటనే తారక్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే ఉప్పెనతో సెన్సేషనల్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్టు చేయాలని యంగ్‌ టైగర్‌ నిర్ణయించారు. ఉప్పెన మేకింగ్‌కు ఫిదా అయిన ఎన్టీఆర్‌ స్వయంగా బుచ్చిబాబును పిలిచి మరీ సినిమా చేద్దామని చెప్పారు. డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టును పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాతో పాటు బుచ్చిబాబు మూవీని కూడా ఒకేసారి కంప్లీట్‌ చేయాలని తారక్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం.

థియేటర్లలో శ్యామ్‌ సింగరాయ్‌..? రిలీజ్‌ ఎప్పుడంటే..!


ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జోరుగా సాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో తారక్‌..విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దసరాకు పాన్‌ ఇండియా మూవీని రిలీజ్‌ చేయాలని భావించినా… చాలా రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు ఓపెన్‌కాకపోవడం, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో మూవీ మేకర్స్‌ వెనక్కితగ్గారు.