నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టక్‌ జగదీశ్‌ ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్‌ కాగా.. శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ దాదాపు పూర్తైంది. దీంతో నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమాపై దృష్టి పెట్టారు. రొమాంటిక్‌ కామెడీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేయాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసింది, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నారు.

BALAYYA : అదంతా అబద్ధం.. బాలయ్య సినిమా టైటిల్‌పై క్లారిటీ..


నానికి ఉన్న క్రేజ్‌ కారణంగా ఆయనకు వరస ఆఫర్లు వస్తున్నాయి. అంటే సుందరానికి సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తికాక ముందే డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడైన శ్రీకాంత్‌ నాని కోసం మరో స్క్రిప్ట్‌ రెడీ చేశాడు. సుధాకర్‌ చెరుకూరికి చెందిన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. నాని -శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి దసరాకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.

PURNAA : కేక పుట్టిస్తున్న పూర్ణ లేటెస్ట్‌ హాట్‌ పిక్స్‌..


తాజా సమాచారం ప్రకారం నాని సినిమాకు “దసరా” అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన యువతీయువకుని మధ్య చిగురించే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని సినిమాకు తగ్గట్లుగా మేకోవర్‌ అయ్యే పనిలో బిజీగా ఉన్నారు. దసరాకు సినిమా టైటిల్‌తో పాటు నాని ఫస్ట్‌ లుక్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశముంది. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్లను సైతం ఇప్పటికే ఫైనల్‌ చేశారు. దసరాకు ఆ వివరాలు వెల్లడించనున్నారు. నాని ప్రేమకథను 2022 దసరాకు విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు.