అక్కినేని నాగచైతన్య – సాయిపల్లవి నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫీల్‌గుడ్‌ మూవీగా రూపొందిన సినిమా ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకురానుండటంతో చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది. లవ్‌స్టోరీలో చైతూ డ్యాన్స్‌మాస్టర్‌గా కనిపించాడు. తెలంగాణ స్లాంగ్‌లో సాయిపల్లవి మరోసారి ఇరగదీసినట్లు ఆమె డైలాగ్స్‌ను బట్టి తెలుస్తోంది. బతుకు కోసం ఈ ఉరుకులాడటం మాత్రం నాతోని కాదింక. చస్తే చద్దాం..కానీ తేల్చుకునే చద్దాం అంటూ ట్రైలర్‌ చివరలో నాగచైతన్య చెప్పే డైలాగ్‌ ఎమోషన్స్‌ను పండిస్తోంది.

మారేడుమిల్లిలో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్‌.. కాకినాడ పోర్టులో బన్నీ..


ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య మధ్యతరగతి యువకుడి పాత్ర పోషించాడు. కుటుంబ పోషణ కోసం పట్నం వచ్చి డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న యువతిగా సాయిపల్లవి సందడి చేయనుంది. స్థితిమంతులైన హీరోయిన్‌కి, మధ్య తరగతికి చెందిన హీరోకి మధ్య ప్రేమ ఎలా పుట్టింది. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు వారు ఏం చేశారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. లవ్‌స్టోరీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్ దాస్‌, రామ్మోహన్‌రావు నిర్మించారు. సినిమాలో సారంగదరియా పాట ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది.