Cineism

మొన్న తారక్‌.. నేడు రామ్‌చరణ్‌.. చెర్రీ కారు మామూలుగా లేదుగా

తెలుగు హీరోల్లో చాలా మందికి కార్లంటే పిచ్చి. మార్కెట్లోకి కొత్తగా ఏదైనా కారు వచ్చిందంటే తమ గ్యారేజీలో దాన్ని చూసుకునేందుకు ఉబలాటపడారు. ఈ మధ్యకాలంలోనే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లంబోర్గిని ఊరూస్‌ మోడల్‌ కారును తీసుకోగా.. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా మరో కొత్త కారు కొన్నారు. న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారు మేబాచ్‌ జీఎల్‌ఎస్‌ 600 సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్‌ స్పెషల్‌గా డిజైన్‌ చేయించుకున్నాడట.

చస్తే చద్దాం.. కానీ తేల్చుకునే చద్దాం.. ఇంట్రెస్టింగ్‌గా లవ్‌స్టోరీ ట్రైలర్‌
 

సోమవారం చెర్రీ కారు డెలివరీ తీసుకున్నాడు.  కారు హ్యాండోవర్‌ చేసుకున్న తర్వాత తన టీంతో కలిసి కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హై సెక్యూరిటీ, అల్ట్రా మాడ్రన్‌ టెక్నాలజీతో చరణ్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కార్‌ ధర దాదాపు రూ.2.5కోట్లు. చెర్రీ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎండబ్ల్యూ సహా పలు మోడల్‌ల కార్లు ఉన్నాయి.

Exit mobile version