సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా సోషల్‌ మెసేజ్‌ ఇచ్చే సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఈ మధ్యనే గోవా షెడ్యూల్‌ పూర్తికాగా విదేశాల్లో మరికొంత షూటింగ్‌ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఫారిన్‌ పార్ట్‌ను అమెరికాలో షూట్‌ చేయాలని మేకర్స్‌ తొలుత నిర్ణయించారు. యూఎస్‌ఏలో కరోనా కేసులు పెరుగుతుండటంతో షెడ్యూల్‌ను వాయిదా వేశారు. ఇండియాలో జరపాల్సిన చిత్రీకరణను ఈ నెల చివరి నాటికి పూర్తి చేసి ఆ తర్వాత అమెరికా వెళ్లేలా ప్లాన్‌ చేసింది చిత్ర యూనిట్‌.

కాజల్‌ గుడ్‌న్యూస్‌ చెబితే ఆ సినిమాల సంగతేంటి..?


తాజాగా సర్కారు వారి పాటకు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఫారిన్‌లో జరపాల్సిన షూట్‌ను అమెరికాకు బదులుగా స్పెయిన్‌లో షూట్‌ చేయాలని మూవీ మేకర్స్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. ఇందుకోసం సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌ వచ్చే నెల స్పెయిన్‌ వెళ్లనుంది. అక్టోబర్‌ మొదటివారం నుంచి స్పెయిన్‌లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్‌లో టాకీతో పాటు రెండు పాటలను షూట్‌ చేసేలా ప్లాన్‌ చేశారు. స్పెయిన్‌లో నెలరోజుల పాటు ఈ షూటింగ్‌ కొనసాగనుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో జరిపే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తికానుంది.

AKHANDA : బాలయ్య దసరా బరిలో నిలుస్తాడా..?


సర్కారువారి పాట సినిమాకు పరుశురామ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ కనిపించనుండగా… సముద్రఖని విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్, గోపీ ఆచంట, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. నిరవధికంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సర్కారువారి పాట సంక్రాంతి కానుకగా 2022 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.