అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. ఎట్టకేలకూ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా నుంచి లెహరాయి అనే లిరికల్‌ సాంగ్‌ను మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం, అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ, వాసు ఈ సినిమా నిర్మించారు.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ను అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సినిమా టీజర్‌, పాటలు ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన లెహరాయి పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా సిద్‌ శ్రీరామ్‌ పాడారు. గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు.