నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సెప్టెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా మంగ్లీ పాడిన సారంగదరియా సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. దాని కుడి భుజం మీద కడువా అంటూ సాగే ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. మంగ్లీ గాత్రానికి, సాయిపల్లవి స్టెప్పులు తోడవడంతో సారంగదరియా పాట దుమ్మురేపింది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు ఈ సాంగ్‌ను 32కోట్ల మంది చూశారు.

MAHESH BABU : స్పెయిన్‌కు వెళ్తున్న మహేశ్‌బాబు..


సారంగదరియా తెలుగు ప్రజలనే కాదు.. విదేశీయులను కూడా తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ కొరియన్‌ యువతి ఈ పాటను అద్భుతంగా ఆలపించింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతోంది. భాషను అర్థం చేసుకుని తెలంగాణ జానపదాల్ని అవలీలగా పాటిన ఆ యువతి ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 9లక్షల మందికి పైగా చూశారు. ఈ పాట పాడిన అమ్మాయి పేరు మాత్రం తెలియలేదు. యూట్యూబ్‌లో సారంగదరియా కవర్‌బై జీ1 మాత్రమే ఉంది.