నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన టక్‌ జగదీశ్‌ ఫ్యాన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా రొటీన్‌ టాక్‌ తెచ్చుకోవడంతో అభిమానులు నాని నుంచి మంచి ఎంటర్‌టైనర్‌ కోసం ఎదురుచూస్తున్నారు. నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ పూర్తైంది. టాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంక్రీత్యన్‌ డైరెక్షన్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరగుతోంది. మరోవైపు నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుందరానికి అనే సినిమా సెట్స్‌పై ఉంది. తాజాగా శ్యామ్‌ సింగరాయ్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారింది.

పాటల కోసం గోవాకు బాలయ్య.. అఖండ విడుదలపై సస్పెన్స్‌..?


శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవి కనిపించనుంది. సెకండ్‌ హీరోయిన్‌గా ఉప్పెన భామ కృతి శెట్టి అలరించనుంది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్‌ కీ రోల్‌ ప్లే చేశారు. మూవీ మేకర్స్‌ ఇప్పటికే రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో ఫ్యాన్స్‌ శ్యామ్ సింగరాయ్‌ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మారేడుమిల్లిలో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్‌.. కాకినాడ పోర్టులో బన్నీ..


శ్యామ్‌ సింగరాయ్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జెట్‌ స్పీడ్‌తో జరుగుతోంది. సెన్సార్ పూర్తి చేసుకుని అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో సినిమా రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. చిత్ర విడుదలకు సంబంధించి దర్శక నిర్మాతలు త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారు. త్వరలోనే మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.


ఇదిలా ఉంటే టక్‌ జగదీశ్‌లాగే శ్యామ్‌ సింగరాయ్‌ను కూడా ఓటీటీలో రిలీజ్‌ చేస్తారా లేక థియేటర్లలో విడుదల చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఓ కంపెనీ దాదాపు 40 కోట్ల రూపాయలు చెల్లించి ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసిందని సోషల్‌ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే ఈ ఊహాగానాలను మూవీ మేకర్స్‌ కొట్టిపారేశారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. టక్‌ జగదీశ్‌ విషయంలో జరిగిన రచ్చ నేపథ్యంలో శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నట్లు సమాచారం. హీరో నాని సైతం థియేట్రికల్‌ రిలీజ్‌కు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాతలు త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఏదేమైనా టక్‌ జగదీశ్‌తో నిరాశ చెందిన నాని ఫ్యాన్స్‌కు శ్యామ్‌ సింగరాయ్‌ ఎలాంటి ట్రీట్‌ ఇస్తుందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్‌ చేయాల్సిందే.