మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ మరో అడుగు ముందుకేసింది. ట్రస్ట్‌ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ను చిరు తనయుడు రామ్‌ చరణ్‌ లాంఛ్‌ చేశారు. మరిన్ని ప్రాంతాలు, మరింత మంది జనానికి చిరంజీవి బ్లడ్‌, ఐ బ్యాంక్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు చెర్రీ చెప్పారు. 25 భాషల్లో వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంటుందని అన్నారు.

మరోవైపు చిరంజీవి సినీ ప్రస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా మరో వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. చిరు కెరీర్‌, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపేందుకు ‘కె.చిరంజీవి’ పేరుతో మరో వెబ్‌సైట్‌ని చరణ్‌ అందుబాటులోకి తెచ్చారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.