నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త తరహా కథలు ఎంచుకుంటూ డిఫరెంట్‌ లుక్స్‌తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన అఖండ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో అఘోరా, రైతు పాత్రల్లో కనిపించనున్నారు. అఖండలో అఘోరా గెటప్‌కు ఫ్యాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కావడంతో ఫ్యూచర్‌ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు బాలయ్య


బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనితో చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనుంది. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్‌ సినిమాలోనూ బాలయ్య డ్యూయెల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన స్వామీజీ పాత్ర పోషిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుందని సమాచారం. బాలయ్య ఇలా డిఫరెంట్‌ రోల్స్‌కు ఓకే చెప్పడంపై ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


క్రాక్‌ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుని జోష్‌ మీదున్న గోపీచంద్‌ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలున్నాయి. సినిమాలో బాలయ్యను డిఫరెంట్‌గా చూపేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌పై పని జరుగుతోందని సమాచారం. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ ఫ్లాష్‌బ్యాక్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. కథ మొత్తం రాయలసీమ – కర్నాటక బోర్డర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని టాక్‌ వినిపిస్తోంది.


బాలయ్య- గోపీచంద్‌ మలినేని సినిమా టైటిల్‌ కు సంబంధించి ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాకు బాలయ్య అనే టైటిల్‌ రిజిస్టర్‌ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను అప్పుడే ప్రకటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం.