ACHARYA : మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సి ఉండగా.. సెకండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌లు నిలిచిపోవడం, రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుతో బిజీకావడంతో ఆలస్యమైంది. ఆచార్య షూటింగ్‌ నిలిచిపోవడంతో చిరంజీవి సైతం లూసిఫర్‌ తెలుగు రీమేక్‌ గాడ్‌ఫాదర్‌పై దృష్టి పెట్టారు. ఈ మధ్యనే ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టడంతో షార్ట్‌ బ్రేక్‌ తీసుకున్న చెర్రీ మళ్లీ ఆచార్య సెట్స్‌లో అడుగుపెట్టారు. తండ్రీకొడుకులిద్దరూ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.

అక్టోబర్‌ నుంచి ఎన్టీఆర్‌ 30.. ఫ్యూచర్‌ ప్రాజెక్టులతో తారక్‌ బిజీ..


ఆచార్య టాకీ పార్ట్‌ షూట్‌ దాదాపు పూర్తైంది. ప్యాచ్‌ వర్క్‌లతో పాటు రెండు పాటలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒకటి చిరు – చెర్రీలపై షూట్‌ చేయనుండగా… మరొకటి రామ్ చరణ్‌ – పూజా హెగ్డేపై చిత్రీకరించనున్నారు. బుధవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌ శివార్లలో పెండింగ్‌లో ఉన్న ఒక పాట షూటింగ్‌ ప్రారంభమైంది.. ఈ సాంగ్‌లో తండ్రీకొడుకులిద్దరూ కలిసి స్టెప్పులేసి మెగా ఫ్యాన్స్‌కు కనువిందు చేయనున్నారు. ఈ సాంగ్‌ షూట్‌ వారం రోజుల పాటు కొనసాగనుంది. సిచ్యుయేషన్‌కు తగ్గట్లుగా రాత్రివేళ్లలో మాత్రమే పాటను చిత్రీకరిస్తున్నారు.

టాలీవుడ్‌కు గుడ్‌బై..? చైతూతో సమంత దూరానికి రీజన్ అదేనా..


ఇక పెండింగ్‌లో ఉన్న మరో పాటను రామ్‌చరణ్‌ – పూజా హెగ్డేపై చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్‌ వచ్చేవారం నుంచి ప్రారంభంకానుంది. రెండు సాంగ్స్‌ పూర్తైన తర్వాత మిగతా పెండింగ్‌ ప్యాచ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలాఖరుకు ఆచార్య షూటింగ్‌ పూర్తి చేయాలని మూవీ మేకర్స్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వీలైనంత తొందరగా పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఆ వెంటనే మూవీ ప్రమోషన్‌ మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్‌ హమీదా హాట్‌ పిక్స్‌


తాజా సమాచారం ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచే మిగతా చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారం ముందుగా ఈ సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం. జనవరి 8న మూవీని ప్రేక్షకుల ముందుకు తేవాలని మూవీ మేకర్స్‌ భావిస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆచార్య సినిమాలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు.