మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కుతోంది. RC15 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వానీ కనిపిచంనుంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరగగా.. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. RC 15లో చరణ్‌ పవర్ఫుల్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఐఏఎస్‌ అధికారి పొలిటీషియన్‌గా మారి రాజకీయ వ్యవస్థలో తెచ్చిన మార్పులే కథాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. రాం చరణ్ – శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ భారతీయుడు రేంజ్‌లో ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


శంకర్‌ సినిమాలో కేవలం హీరోనే కాదు.. మిగతా పాత్రలు అంతే హైలైట్‌ అవుతాయి. చివరకు విలన్‌ పాత్రలు కూడా బలంగా కనిపిస్తాయి. తాజాగా RC 15 విలన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్‌ సురేష్‌ గోపీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌, పాత్రకు సంబంధించి ఇప్పటికే ఆయనతో డిస్కషన్‌ పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.


చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా.. జయరాం, సునీల్‌, అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా నెగిటివ్‌ రోల్‌ పోషించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం సమకూర్చుతున్నాడు.