అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడోసినిమా విశేషాలివి. ఈ సినిమాలో త్రివిక్రమ్‌ మరోసారి నాన్న సెంటిమెంట్‌నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్‌ సినిమాల్లో నాన్న పాత్రలు చాలా బలంగా ఉంటాయి. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే దగ్గర నుంచి అదే పంథా కనబడుతుంది. అల్లుఅర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన జులాయిలోనూ తండ్రి పాత్ర పోషించిన తనికెళ్ళ భరణితో అలరించే సన్నివేశాలతో పాటు కంటతడి పెట్టించాడు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమా అంతా.. నాన్న పరువు, ప్రతిష్ట కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా కూడా నాన్న పాత్ర ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ` నాన్న, నేను `. అని అనుకుంటున్నారు.

                 తండ్రి, కొడుకుల మధ్య అనుబంధాన్ని మరోసారి త్రివిక్రమ్‌ తనదైన శైలిలో చెప్పనున్నాడు. `నాన్న, నేను` టైటిల్‌ చూస్తుంటే.. గతంలో సూర్య నటించిన సూర్య సన్‌ ఆఫ్‌ కృష్ణన్‌ గుర్తుకువస్తుంది. ఆ సినిమాలోనూ తన జీవితంలో జరిగిన అనేక కీలక సంఘటనలు, మలుపులను సూర్య తన తండ్రితో ఓ డైరీలో చెప్పుకుంటున్నట్లుగా సినిమా నడుస్తోంది. మరీ.. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమా కూడా ఇలాగే ఉంటుందని.. కొత్త తరహా స్క్రీన్‌ప్లే సాగుతుందో చూడాలి.

                ఈ సినిమా నిర్మాతలు అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సన్నిహితులే. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌ సినిమాలు నిర్మించే రాధాకృష్ణ.. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా పూజాహేడ్గే నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. నివేదా థామస్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కితికా శర్మ అనే కొత్త నటికి అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. నివేదా థామస్‌, కితికా శర్మలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

              సాధారణంగా త్రివిక్రమ్‌ సినిమాలు చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తారు. అందుకే ఆయన బయట బ్యానర్లకు కాకుండా.. హారిక హాసినికే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. అయితే.. గతంలో ఖలేజా కష్టాల నుంచి బయటపడేందుకు జులాయి సినిమాను త్రివిక్రమ్‌ శరవేగంగా పూర్తిచేశారు. త్రివిక్రమ్‌ అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసిన సినిమా జులాయి నిలిచిపోయింది. మళ్ళీ అదే స్పీడుతో `నాన్న, నేను` సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ నెలఖారు నుంచి చివరి షెడ్యూల్‌ ప్రారంభంకానుంది. `నాన్న, నేను` సినిమా పేరు దాదాపు ఖాయం కానుండగా.. మరోవైపు.. అలకనంద అనే టైటిల్‌ కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

#AlluArjun, #Trivikram Film Title – #NannaNenu. Another Father Sentiment From #AlluArjun, #Trivikram. The Duo Already Don A film On #FatherSentiment Called Sun Of Satyamurthy. #AlluArjun s Third Film With #Trivikram. They Worked For #Julai, #SunOfSatyamurthy ( #S/oSatyamurthy ). And Now #NannaNenu. Another Title Also In Their Thoughts – #Alakananda. Nivedha Thomas, Kitika Sharma Another Leading Charectors In This Film.