Cineism

పాటల కోసం గోవాకు బాలయ్య.. అఖండ విడుదలపై సస్పెన్స్‌..?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. సింహా, లెజెండ్‌ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అఖండ విడుదల కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి బాలయ్య తన రేంజ్‌ హిట్‌ కొట్టి చాలా కాలమైంది. ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే మూవీ ఏదీ రాకపోవడంతో అందరూ అఖండపైనే ఆశలు పెట్టుకున్నారు. ఒకవైపు బాలయ్య నటన, మరోవైపు బోయపాటి డైరెక్షన్‌ వెరసి అఖండ బంపర్‌ హిట్‌ కొట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 కంటెస్టెంట్‌ హమీదా హాట్‌ పిక్స్‌


అఖండలో బాలయ్య డ్యూయెల్‌ రోల్‌లో కనిపించనున్నారు. అఘోరాగా, రైతుగా బాలకృష్ణ అలరించనున్నట్లు తెలుస్తోంది. రెండు పాటలు మినహా అఖండ టాకీ పార్ట్‌ పూర్తైంది. ప్రస్తుతం మూవీ యూనిట్‌ పాటల చిత్రీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం గోవాలో అందమైన లొకేషన్స్‌ను వెతికే పనిలో పడింది. లొకేషన్స్‌ ఫైనల్‌ అయిన వెంటనే టీం గోవాకు పయనం కానుంది. ఒకవైపు అఖండ షూటింగ్‌ కొనసాగుతుండగానే మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ సైతం శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని మూవీ మేకర్స్‌ పట్టుదలతో ఉన్నారు.

Balayya : ఆ హీరోయిన్‌ వాల్‌ పేపర్‌గా బాలయ్య..


ఈసారి పెద్ద చిత్రాలేవీ బరిలో లేకపోవడంతో అఖండను దసరాకు విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అక్టోబర్‌ 8 లేదా 13వ తేదీన చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే నెల రోజుల సమయం కూడా లేకపోవడం, మరోవైపు ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కిరాకపోవడంతో దసరాకు అఖండ విడుదల అవుతుందా లేదా అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌గా మారింది. దీంతో బాలయ్య అభిమానులు అఖండ యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అఖండలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ హీరోగా పేరున్న శ్రీకాంత్‌ విలన్‌ పాత్ర పోషించాడు. సినిమాకు థమన్‌ స్వరాలు సమకూర్చాడు.

మారేడుమిల్లిలో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్‌.. కాకినాడ పోర్టులో బన్నీ..


అఖండ మూవీ తర్వాత బాలయ్య.. డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేనితో సినిమా చేయనున్నాడు. క్రాక్‌ మూవీ హిట్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న గోపీచంద్‌ మాస్‌మసాలా ఎంటర్‌టైనర్‌తో నందమూరి అభిమానులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్బీకే 107 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభం కానున్న ఈ సినిమాకు రౌడీయిజం టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఫ్యాక్షన్‌ లీడర్‌, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో బాలకృష్ణతో హీరోయిన్‌ త్రిష రొమాన్స్‌ చేయనున్నట్లు సమాచారం. బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాకు సంబంధించి దసరాకు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చే ఛాన్సుంది. దీంతో పాటు అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా మరో సినిమా కూడా పట్టాలెక్కనుంది.

Exit mobile version