బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5లో గ్లామర్‌ డోస్‌ తగ్గిపోయింది. ఎలిమినేషన్‌ పేరుతో బిగ్‌బాస్‌ నలుగురు ముద్దుగుమ్మలను బయటకు పంపేశాడు. సరయూ, లహరి, హమీదా, శ్వేత ఇలా వరుసబెట్టి అమ్మాయిలందరూ హౌస్‌ను వీడటంతో చాలా మంది ఆడియెన్స్‌కు షోపై ఇంట్రెస్ట్‌ తగ్గిపోయింది. ఇది గ్రహించిన బిగ్‌బాస్‌ మళ్లీ గ్లామర్‌ డోస్‌ పెంచే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన అమ్మాయిల్లో ఒకరిని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తిరిగి ఇంట్లోకి పంపనున్నట్లు సమాచారం.


బిగ్‌బాస్‌ సీజన్‌ 5లో 3వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది లహరి షారి. తన ఆటతీరుతో ఆమె టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఆమె నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మూడో వారంలోనే లహరి ఎలిమినేట్‌ అయింది. ఇంత త్వరగా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ ఆమె రీ ఎంట్రీకి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా లహరిని మరోసారి హౌస్‌లోకి పంపనున్నట్లు తెలుస్తోంది.


మూడోవారం నామినేషన్స్‌ సమయంలో నటి ప్రియ, లహరిని నామినేట్‌ చేసింది. ఈ సందర్భంగా ప్రియ వర్సెస్‌ రవి -లహరిల మధ్య జరిగిన గొడవ హాట్‌ టాపిక్‌ అయింది. లహరి ఎప్పుడూ హౌస్‌లో ఉన్న మగాళ్లతో బిజీగా ఉంటుందని, అబ్బాయిలకు తప్ప అమ్మాయిలకు టైం ఇవ్వదని ప్రియ నోరు పారేసుకుంది. ఈ కామెంట్లపై పెద్ద దుమారమే రేగింది. ప్రియ మాట్లాడిన మాటలు లహరి నామినేషన్‌పై నెగిటివ్‌ ఇంపాక్ట్ చూపాయి. ఆ ఇష్యూపై హోస్ట్‌ నాగార్జున వీకెండ్‌లో వీడియో ప్లే చేసి క్లారిటీ ఇచ్చినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లహరి హౌస్‌ నుంచి బయటకు రాక తప్పలేదు.


బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో మానస్‌ – లహరితో సరదాగా ఉండేది. ఈ మధ్యనే మానస్‌ లహరి పేరు చెప్పి ప్రియాంకను ఆట పట్టించడాన్ని బట్టి చూస్తే ఆమె త్వరలోనే హౌస్‌లోకి వచ్చే ఛాన్సున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆట మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. మోడల్‌ కమ్‌ యాంకర్‌ అయిన లహరి విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లోనూ కనిపించి మంచి పేరు తెచ్చుకుంది.