బిగ్‌బాస్‌ సీజన్‌ 5 రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఎవరో ఏ గ్రూపులో ఉన్నారో అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. కొత్త గ్రూపులు తయారవుతున్నాయి. మరోవైపు ప్రియ, సన్నీ మధ్య గొడవ.. కొట్టుకునేంతవరకు వెళ్ళింది. బిగ్‌బాస్‌ హౌజ్‌ రూల్స్‌ అతిక్రమణ కూడా కొనసాగుతోంది. సభ్యుల మధ్య స్పిరిట్‌ పెంచాల్సిన గేమ్‌… మనస్పర్థలకు దారితీస్తోంది. మరోవైపు… తమ స్నేహితుల చేష్టలతో.. సిరి, మానస్ కన్నీరు పెట్టుకున్నారు.


బిగ్‌బాస్‌ హౌస్‌లో 44వ రోజు నామినేషన్స్‌పై ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ జరిగింది. ఈ విషయంపై సన్నీ, మానస్‌, కాజల్‌ మాట్లాడుకున్నారు. రవి, ప్రియాంక, సిరి నామినేషన్‌ పేరుతో నాటకాలు ఆడుతున్నారని సన్నీ ఆరోపించాడు. నామినేషన్‌ నువ్వే చేసినట్లుగా ఉందని అందరూ అనుకుంటున్నారని మానస్‌.. సన్నీతో చెప్పాడు. మానస్‌ వాదనతో కాజల్‌ ఏకీభవించింది. సన్నీ మాత్రం తాను చేసింది కరెక్టే అని సమర్థించుకున్నాడు. ప్రియ కావాలని తనను టార్గెట్‌ చేసిందన్నాడు. ప్రియ.. రవిని నామినేట్‌ చేస్తే, నేను సరే అన్నానని తెలిపాడు. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్ చెప్పొద్దని స్పష్టం చేశాడు. ఈ విషయంపై జెస్సీతో షణ్మఖ్‌ మధ్య కూడా చర్చ జరిగింది. టాస్కుల దగ్గర ఫ్రెండ్‌షిప్‌ కరెక్ట్‌ కాదన్నాడు షన్ను.


తాను నామినేట్‌ చేసిన కాజల్‌ని కాదని, రవిని నామినేట్‌ చేయడంపై ప్రియాంక ఇంకా కోపంతోనే ఉంది. కాజల్‌ని డ్రామా క్వీన్‌ అని, సేఫ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలని సవాల్‌ చేసింది. మానస్‌ సైతం తనని అర్థం చేసుకోవడం లేదని యానీ మాస్టర్‌ దగ్గర వాపోయింది. తాను ఇష్టపడుతున్నప్పటికీ మానస్‌ తనని దూరం పెడుతున్నాడని ఆవేదన చెందింది. అప్పుడే అక్కడికి మానస్‌ వచ్చాడు. ప్రియాంక భోజనం చేయలేదని చెప్పిన యానీ మాస్టర్‌ చెప్పడంతో మానస్‌ గోరుముద్దలు తినిపించాడు. అప్పటిదాకా డల్‌గా ఉన్న ప్రియాంక.. సంతోషంతో మాటలు కలిపింది. ఇంతకుముందు మానస్‌ ఎవరికి భోజనం తినిపించాడో చెప్పి… తనపై ఎప్పుడూ స్పెషల్‌ ఫోకస్‌ ఉంటుందని తెలిపింది. మానస్‌ని జాగ్రత్తగా ఉండాలని సరదాగా హెచ్చరించింది.


మరోవైపు నామినేషన్స్‌పై కాజల్‌, రవి మాట్లాడుకున్నారు. తనను నామినేట్‌ చేసి… సన్నీ తప్పు చేశాడని రవి అసహనం వ్యక్తం చేశాడు. సన్నీ తప్పు చేశాడనే వాదనను కాజల్‌ కొట్టిపారేసింది. ఫ్రెండ్‌ కోసమే అలా చేశాడని వివరించింది. అప్పుడు నువ్వు ఫ్రెండ్‌వైతే నేను కాదా అని రవి కాజల్‌ని నిలదీశాడు. గేమ్‌లో ఫ్రెండ్‌షిప్‌ ఉండొద్దన్న రవి వాదనను ఒప్పుకోని కాజల్‌.. గతంలో తనను అకారణంగా నామినేట్ చేసినందుకు సారీ చెప్పింది.


ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ పేరుతో సభ్యుల మధ్య బిగ్‌బాస్‌ మారోసారి మంటపెట్టాడు. ఎవరైతే ఎక్కువ గుడ్లు కలెక్ట్‌ చేస్తారో వారే కెప్టెన్‌ అని ప్రకటించాడు. ఇదికాస్తా సన్నీ, ప్రియా మధ్య మరోసారి చిచ్చురాజేసింది. బిగ్‌బాస్‌ రూల్‌ ప్రకారం గుడ్లు కలెక్ట్‌ చేయడమే తన లక్ష్యమని ప్రియా స్పష్టం చేసింది. ఇందుకోసం దేనికైనా సిద్ధమని సవాల్ విసిరింది. అవతలివాళ్ళ గుడ్లు దొంగలించడమూ తన స్ట్రాటజే అని చెప్పడంతో సన్నీ అలర్ట్‌ అయ్యాడు. తన గుడ్లను కాపాడమని కాజల్‌ని అడిగాడు. ఈ విషయంపై యానీ మాస్టర్‌, రవి మాట్లాడుకున్నారు. ఇండివిడ్యుయల్‌ టాస్క్‌లో ఇద్దరు సభ్యులు కలిసి ఆడితే.. మొత్తం టాస్కే రద్దయిపోతుందని అభిప్రాయపడింది. ప్రియా చెప్పినట్లే సన్నీ గుడ్లను మాయం చేసింది. దీంతో సన్నీ ఆవేశంతో ఊగిపోయాడు. తనతో ఆడుకుంటే… తాను అసలైన ఆట చూసిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. గుడ్లను తానే దొంగిలించనన్న అంగీకరించిన ప్రియ గేమ్‌లో భాగంగానే అలా
చేశానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాదన తీవ్రస్థాయికి చేరింది.


చేతగాని వాళ్ళు మాత్రమే దొంగదెబ్బ తీస్తారన్న సన్నీ.. గేమ్‌ స్పిరిట్‌తో ఆట ఆడాలన్నాడు. అందుకు ప్రియ తాను దొంగతనం చేయడం తప్పేంకాదని సమర్థించుకుంది. కోపంతో సన్నీ అక్కడున్న కడ్డీని కొట్టగా.. కామన్‌సెన్స్‌తో ఆడాలని ప్రియ వాదించింది. అటు.. సన్నీ ఫ్రెండ్‌ అయిన మానస్‌…, ప్రియ ఇచ్చిన గుడ్లను తీసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ టాస్క్‌లో లోబో ఉంటే.. ఆటే తీరే డిఫరెంట్‌గా ఉండేదని సన్నీ, రవి మాట్లాడుకున్నారు. సీక్రెట్‌ రూమ్‌లో ఉండి ఈ మాటలు విన్న లోబో హ్యాపీగా ఫీలయ్యాడు. ప్రియా ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకున్న సన్నీ… కాజల్‌తో కలిసి సిరి, శ్రీరామ్‌ గుడ్లును దొంగిలించారు. చివరకు సన్నీ దాచిన గుడ్లు మారోసారి మాయమయ్యాయి. దీనిపై స్పందించిన యానీ మాస్టర్‌ ఇది నువ్వు నేర్పిన విద్యేనని కౌంటరిచ్చింది. ఫస్ట్‌ రౌండ్‌ ముగిసేసరికి మానస్‌ దగ్గర మిగతా ఇంటి సభ్యుల కన్నా ఎక్కువగా 32 గుడ్లు ఉన్నాయి. ప్రియాంక సపోర్ట్‌, ప్రియ దగ్గర నుంచి గుడ్లు తీసుకున్నందునే అన్ని గుడ్లు మానస్‌ దగ్గర ఉన్నాయని యానీ మాస్టర్ మండిపడింది.


గుడ్ల టాస్క్‌ తర్వాత బిగ్‌బాస్‌ హౌజ్‌లో శోకాలు మొదలయ్యాయి. ఎప్పుడూ వారియర్‌గా ఆటలో ముందుండే సిరి కన్నీరు పెట్టుకుంది. గుడ్ల కోసం తమ బెడ్‌ని ఎందుకు వెతికావని జెస్సీ అడిగడంతో సిరి హర్ట్‌ అయింది. ఎప్పుడూ బ్యాలెన్స్‌డ్‌గా ఉండే మానస్‌ సైతం తనను అందరు అపార్థం చేసుకుంటున్నారని సన్నీ దగ్గర ఏడ్చేశాడు. మనం లైఫ్‌లాంగ్‌ బెస్ట్‌ఫ్రెండ్స్‌ అంటూ.. సన్నీ సముదాయించాడు. దీంతో 44వ రోజు పూర్తయింది.
45వ రోజుకు సంబంధించిన ప్రోమో చూస్తే.. ప్రియ, సన్నీ మధ్య గొడవ పీక్స్‌కు వెళ్లింది. సన్నీని మరోసారి టార్గెట్‌ చేసింది ప్రియ.. అతడి బుట్టలోని గుడ్లును దొంగిలించే ప్రయత్నం చేయగా.. సన్నీ వాటిని కాపాడుకునేందుకు కష్టపడ్డాడు. ఇదికాస్తా తోపులాటకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియ.. సన్నీని కొట్టినంత పనిచేసింది. గేమ్‌ని గేమ్‌లా ఆడుకుంటే చెంప పగులుతుందని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో సన్నీ కూడా ఫైర్‌ అయ్యాడు. పరిస్థితి ఒకరికొకరు కొట్టుకునేంతవరకు వెళ్ళగా.. అతికష్టం మీద ఇంటిసభ్యులు ఆపారు. మరి ఇంట్లో జరిగిన గొడవలపై బిగ్‌బాస్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.