ఆవేశం.. కోపం… తనపై తాను నియంత్రణ కోల్పోడాన్ని బిగ్‌బాస్‌ అస్సలు ఒప్పుకోడు. గత సీజన్‌లో చాలామంది కంటెస్టెంట్‌లు ఎలిమినేట్‌ కావడానికి ఇదే కారణం. సీజన్‌ ఫైలో చూసిన ఇదే అదే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన ఆరుగురిలో నలుగరు ఆవేశపరులే. తమ కోపమే వారికి శతృవైంది. హౌస్‌ నుంతి ఫస్ట్‌ ఎలిమినేట్‌ అయిన సరయూ నుంచి ఉమాదేవి, లహరి, శ్వేత.. తమ ఆట తాము ఆడతారు. ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం అస్సలు సహించరు. అందుకే.. ఈ నలుగురు ఎలిమినేట్‌ అయ్యేందుకు ఇతర కారణాలు ఉన్నా.. మెయిన్‌ రీజన్‌ మాత్రం వారి కోపమే.


ఈ వారం నామినేషన్‌లో ఉన్న యానీ మాస్టర్‌ మెడపై కోపం కత్తి వేలాడుతోంది. ఏ గేమ్‌ అయినా సరే రూల్స్‌ ప్రకారం ఆడాలంటుంది యానీ మాస్టర్‌. కానీ.. ఆ రూల్స్‌లోని లూప్‌హోల్స్‌ని అడ్డంపెట్టుకుని ఇతర కంటెస్టెంట్స్‌ ఆటాడుకుంటే.. సహించలేకపోతోంది. టాస్క్‌లోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. కేవలం వంట గదికే పరిమితమవుతుంది. ఆవేశపడి తప్పులు చేస్తున్న యానీ మాస్టర్‌ ఆటపరంగా బిగ్‌బాస్‌ని మెప్పించలేకపోతోంది.


మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చితే యానీ మాస్టర్‌కి ప్రేక్షకుల సపోర్ట్‌ కూడా తక్కువే. రవి, శ్రీ రామంచంద్ర, సిరి, కాజల్‌ తదితరులు స్ట్రాటజీతో ఇతర పోటీదారులతో ఆడుకుంటున్నారు. యానీ మాస్టర్‌ పద్దతి మాత్రం గాలివాటంగా సాగుతోంది. ఈసారి ఎలిమినేషన్‌లో ఉన్నవారిలో రవి, శ్రీరామచంద్ర చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు. డేంజర్‌ డోన్‌లో ఉన్న సిరికి బయట ప్రేక్షకుల మద్దతు ఉంది. దీనికి తోడు షణ్మఖ్‌ నామినేషన్‌లో లేనందున అతని అభిమానుల ఓట్లన్నీ గంపగుత్తగా ఆమెకే పడతాయి. ఇక సన్నీతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్న ప్రియను బిగ్‌బాస్‌ ఇప్పటికిప్పుడే బయటకు పంపించే అవకాశం లేదు. ఆమెకు టీవీ, సినీ అభిమానులు ఎక్కువే.


యానీ మాస్టర్‌తో పోల్చితే.. జెస్సీ, లోబో కూడా వీక్‌ కంటెస్టెంట్లు. బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ప్రారంభంలో చిన్నపిల్లాడిలా ప్రవర్తించిన జెస్సీ.. ఇప్పుడు పరవాలేదనిపిస్తున్నాడు. కేవలం షణ్మఖ్‌, సిరిలతోనే ఉండటం అతనికి ఒకప్పుడు మైనస్‌ అయినా ఇప్పుడు అదే ప్లస్‌గా మారే అవకాశం లేకపోలేదు. షణ్ముఖ్‌ సపోర్టర్లలో కొందరి ఓట్లు జెస్సీకి పడే ఛాన్సుంది.


ఇక మిగిలింది లోబో. అతను ఇప్పుడు ఫేక్‌ ఎలిమినేషన్‌తో సీక్రెట్‌ రూంలో ఉన్నాడు. గతంలో సీక్రెట్‌ రూంలో ఉన్న వాళ్లు డైరెక్ట్‌గా ఎలిమినేట్‌ అయిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే ఈ వారం లోబో సేఫ్‌. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్‌ బేస్‌ లేని యానీ మాస్టర్‌కు అదృష్టం కలిసి వస్తేనే ఆమె హౌస్‌లో కొనసాగనుంది. లేనిపక్షంలో కూతురుగా భావించిన శ్వేత ఎలిమినేట్‌ అయిన నెక్ట్స్‌ వీకే యానీ మాస్టర్‌ కూడా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రాక తప్పదు.