బాల్యమంటే ఓ మధుర జ్ఞాపకం. కాలచక్రాన్ని తిప్పే అవకాశమే వస్తే… చాలామంది చిన్నపిల్లలైపోవడానికే ఇష్టపడతారు. చిన్నప్పుడు గడిపిన క్షణాలను నెమరవేసుకుంటారు. ఇటీవల భార్య ఉపాసనతో కలిసి ఊటీకి వెళ్లిన మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సైతం చిన్నపిల్లడైపోయాడు.

లవడేల్‌లోని ది లారెన్స్‌ స్కూల్‌లోనే చరణ్‌ చదువుకున్నాడు. అక్కడ తాను పడుకున్న బెడ్‌ వద్దకు వెళ్లి తడిమి చూసుకున్నాడు. భోజనశాలకు వెళ్ళి చిన్నప్పుడు కూర్చున్నట్లే కూర్చోని ఆనందపడిపోయాడు. పాఠశాల అంతా కలియతిరిగాడు. పాఠశాల విద్యార్థులతో ఫోటోలు దిగాడు. స్కూల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు… చరణ్‌.

రామ్‌చరణ్‌ని ఉపాసన మిస్టర్‌ సీ అని ముద్దుగా పిలుచుకుంటుంది. “ మిస్టర్‌ సీ మళ్ళీ పాఠశాలకు వెళ్లాడు” అని రామ్‌చరణ్‌ పాఠశాలలో దిగిన ఫోటోలను తన ట్వీట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

” జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిఉంటాయి.
ప్రతి ఒక్కరూ పాఠశాల జీవితాన్ని మననం చేసుకుంటారని నాకు తెలుసు
స్కూల్‌ క్యాంటీన్‌
డార్మిటరీ
క్లాస్‌ ఫోటో
స్కూల్‌ జ్ఞాపకాలతో మిస్టర్‌ సీ గుండెబరువైంది”.
అంటూ రామ్‌ చరణ్‌ తీపిజ్ఞాపకాలను పంచుకుంది.. ఉపాసన.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిన RRRలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. షూటింగ్‌ సందర్భంగా… రామ్‌చరణ్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ గాయాలపాలయ్యారు. దీంతో షూటింగ్‌ నిలిచిపోయింది. ఈ విరామంలో కుటుంబంతో గడుపుతున్న రామ్‌చరణ్‌… భార్యతో కలిసి ఊటీకి వచ్చాడు.