నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. జస్ట్‌ నా ప్రేమను ఫీలైతే చాలు.. అంటూ సైకిల్‌పై ఆర్యగా అల్లు అర్జున్‌ దూసుకువచ్చిన నేటికి 15 ఏళ్ళు. ఈ సందర్భంగా.. తన ఫేస్‌బుక్‌లో 15 ఏళ్ళ ఆర్య అంటూ.. అల్లు అర్జున్‌ ఓ పోస్ట్‌ పెట్టాడు. ఆ సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

” ఇప్పటికీ ఆ ప్రేమను ఫీలవుతూనే ఉన్నాను. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఆర్య నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా విడుదలై అప్పుడే 15 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నాను. సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌, రత్నవేలు, దిల్‌ రాజుగారికి కృతజ్ఞతలు. అందరికంటే ఆర్యపై ఆధారాభిమానులు చూపిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు”. – అల్లు అర్జున్‌

సినిమాలంటే 90 శాతానిపైగా ప్రేమకథలే ఉంటాయి. అప్పటివరకు ఒకే తరహా ప్రేమకథలు చూసిన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది.. ఆర్య. అప్పటికే ప్రేమలో పడిపోయిన ఓ అమ్మాయి వెంట కథానాయకుడు పడటం, చివరకు ఆమె ప్రేమను దక్కించుకోవడం… కొత్త తరహాలో సాగింది. ఓ సంక్లిష్టమైన కథను… మంచి కామోడీతో సుకుమార్‌ చిత్రీకరించిన విధానం… ఆకట్టుకుంది. సిని‌మా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది.

Arya allu arjun